Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్‌పై జాతి వివక్ష వ్యాఖ్యలు.. హుందాగా కౌంటర్

Usha Vance gives a strong counter to racial remarks against her
Advertisement
  • ఉపరాష్ట్రపతి భార్య ఉషా వాన్స్‌పై జాతి వివక్ష వ్యాఖ్యల కలకలం
  • మిచిగాన్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
  • జేడీ వాన్స్ తాతయ్య ఉషాను అంగీకరించరనే అర్థంతో సోషల్ మీడియా పోస్ట్
  • ఆ వ్యాఖ్యలకు నవ్వొచ్చిందని స్పందించిన ఉషా వాన్స్
  • జేడీ వాన్స్ కుటుంబం తనను ఎంతో ప్రేమగా చూసుకుంటుందన్న ఉషా
Advertisement
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ జాతి వివక్ష వ్యాఖ్యలను ఎదుర్కొన్నారు. ఆమె భారతీయ మూలాలను ఉద్దేశిస్తూ మిచిగాన్ డెమొక్రాటిక్ సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయీద్ చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

అయితే, ఈ విమర్శలపై ఉషా వాన్స్ ఎంతో హుందాగా, గట్టిగా స్పందించారు. ఇటీవల ఒక ర్యాలీలో జేడీ వాన్స్, అబ్దుల్ ఎల్-సయీద్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. షరియా చట్టంపై విమర్శలను శ్వేతజాత్యహంకారంతో ముడిపెడుతూ గతంలో ఎల్-సయీద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. దీనికి ప్రతిగా ఎల్-సయీద్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "జేడీ వాన్స్ తన తాతగారిని కలవడానికి ఒకవేళ టైమ్ మెషిన్‌లో గతంలోకి వెళితే, ఉషాను కూడా తన వెంట తీసుకెళతారని మనం భావించగలమా?" అని పోస్ట్ చేశారు. జేడీ వాన్స్ తాతయ్య తన మనవరాలి భారతీయ మూలాల కారణంగా ఆమెను అంగీకరించరనే అంతరార్థం ఈ వ్యాఖ్యల్లో ఉందని విమర్శకులు అభిప్రాయపడ్డారు.

ఈ వివాదంపై ఉషా వాన్స్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, "ఆ వ్యాఖ్యలను చూసి నాకు నవ్వొచ్చింది. జేడీ వాన్స్ తాతమ్మ, తాతయ్యలను నేను ఎప్పుడూ కలవలేదు అన్నది వాస్తవం. కానీ వారు పెంచిన బిడ్డలను (జేడీ వాన్స్ తల్లి, అత్తామామలు) నేను చూశాను. వారందరూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతారు. నా అత్తగారు నాకు మరో తల్లి వంటి వారు. అంతటి ఉత్తమ సంస్కారం గల పిల్లలను పెంచిన పెద్దలు సైతం కచ్చితంగా ప్రేమమూర్తులే అయి ఉంటారని నేను నమ్ముతున్నాను. వారిని కలవగలిగి అవకాశం ఉండి ఉంటే నేను ఎంతో సంతోషించేదాన్ని" అని అత్యంత హుందాగా బదులిచ్చారు.
Advertisement
Advertisement
Usha Vance
JD Vance
Abdul El Sayed
US Politics
Racial Discrimination
Indian Americans

More Telugu News